శ్రీశైలంలో పది గేట్ల ఎత్తివేత

కర్నూలు : మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉధృతి ఎక్కువైంది. అధికారులు మొత్తం 12 గేట్లకు గాను పదింటిని ఎత్తివేశారు. జలాశయంలోకి 4.04 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2,43,171 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీసీఎంలకు మరో 13 టీఎంసీల మాత్రమే తక్కువ ఉంది. నాగార్జున సాగర్ జలాశయంలోకి లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటని వదులుతున్నారు. ఎడమ, కుడి గట్ల విద్యుత్‌ కేంద్రాలకు మరో 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ఇప్పుడు 150.92 టీఎంసీల నిల్వ ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos