ప్రిన్స్ తో రోరింగ్స్టార్…

  • In Film
  • February 13, 2019
  • 165 Views
ప్రిన్స్ తో రోరింగ్స్టార్…

భరత్‌ అనే నేనే చ్రితం తరువాత ప్రిన్స్‌ మహేశ్‌బాబు నటిస్తున్న కొత్త
చిత్రం మహర్షిపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.దిల్‌రాజు-పీవీపీ-అశ్వనీదత్‌లు
సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రానికి
సంబంధించి నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు ఇటీవల మీడియాతో సినిమా ముచ్చట్లు పంచుకున్నారు.మహర్షి
చిత్రాన్న చూసిన అనంతరం ప్రతీ ఒక్కరూ బరువెక్కిన హృదయాలతో ఇంటికి వెళతారని తెలిపారు.మహర్షి
చిత్రం కథ హీరో మహేశ్‌బాబు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని కథలో అన్ని ఎమోషన్లు
సరిగ్గా కుదిరాయన్నారు.ఒక మామూలు వ్యక్తి మహర్షిగా మారితే ఎలా ఉంటుంది? అన్నది తెరపైన చూపిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 25న సినిమా రిలీజవుతోంది.ఈ చిత్రంలో
మహేశ్‌-అల్లరి నరేష్‌లు ప్రాణస్నేహితులుగా నటిస్తుండగా ఇరువురి మధ్య స్నేహానికి సంబంధించి
వచ్చే సన్నివేశాలు ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తాయన్నారు.కాగా చిత్రంలో అల్లరి నరేష్‌తో
పాటు కన్నడ హీరో శ్రీమురళి కూడా ఓ కీలక పాత్ర నటిస్తున్నారు. పోషిస్తున్నారు. శ్రీమురళి లేటెస్టుగా ఆన్ లొకేషన్ మహేష్ ని కలిసినప్పటి ఫోటోల్ని ప్రముఖ టాలీవుడ్ పీఆర్ వో బీఏ రాజు ట్వీట్ చేశారు. ఇంతకీ శ్రీమురళి ఎవరు? అంటే 2014 కన్నడలో రిలీజైన ఉగ్రం చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో. ప్రస్తుతం ఉగ్రమ్ వీరం అనే సీక్వెల్ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నాడు. దీంతో పాటే కన్నడంలో మదగజ భారాతే అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. కన్నడలో పాపులరైన ఈ స్టార్ ని మహర్షిలో నటింపజేస్తున్నారంటే ఆసక్తికరమైన స్ట్రాటజీనే అనుసరిస్తున్నారని భావించవచ్చు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos