నంద్యాల ఎంపీ కన్నుమూత

నంద్యాల: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆసు పత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణవార్త విని కుటుంబ సభ్యులు,  అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో ఎస్పీవై రెడ్డి జన్మించారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్‌ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నాయకత్వం తనకే టికెట్‌ ఇస్తుందని చివరి నిమిషం వరకూ ఆశ పెట్టుకున్నఆయన, చివరికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నుంచి జనసేన పార్టీ తరుఫున పోటీ చేయించారు. ఎస్పీవైరెడ్డి నంద్యాల, కర్నూలులో రూపాయికే రొట్టె, పప్పు కేంద్రాలు నడిపి ప్రజాభిమానం పొందారు. గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, పార్లమెంట్‌ పరిధిలో ఏ కార్యక్రమాలు జరిగినా వారి కి ఉచిత భోజన వసతి కల్పించడం, బోర్లు, బావులు వేయించడం ద్వారా ప్రజలకు చేరువయ్యా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos