హాస్య సన్నివేశాల కోసం ఏడెకరాల్లో ట్రైన్ సెట్..

  • In Film
  • July 5, 2019
  • 100 Views
హాస్య సన్నివేశాల కోసం ఏడెకరాల్లో ట్రైన్ సెట్..

మహర్షి చిత్ర విజయం అందించిన ఊపుతో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం చిత్రీకరణకు సిద్ధమవుతున్నాడు. పటాస్‌,F2 చిత్రాల తరహాలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా దర్శకుడు అనిల్‌ రావిపూడి కమర్షియల్‌ కామెడి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.కథలో భాగంగా సైన్యంలో పని చేసే మహేశ్‌బాబు కశ్మీర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రైళ్లో వెళ్లే సన్నివేశం ఉంటుందని ఈ సన్నివేశం చాలా లెంగ్తీగా ఉండడంతో పాటు హీరోహీరోయిన్లు ఇతర పాత్రలపై వచ్చే హాస్య సన్నివేశాలు రైళ్లో ఉండడంతో ట్రైన్‌ ఎపిసోడ్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏడు ఎకరాల్లో ట్రైన్‌ సెట్‌ వేసి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ లో మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక, బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్ అలానే మరికొంతమంది కమెడియన్లు కనిపిస్తారట.ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటుంది కాబట్టి సెట్ వేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నారట..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos