ఒక్క రేయి ఖర్చు అక్షరాలా రూ.8 లక్షలు

ఒక్క రేయి ఖర్చు అక్షరాలా రూ.8 లక్షలు

న్యూ ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి బస చేయనున్నఇక్కడి ఐటీసీ మౌర్యా హోటల్లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ బాడుగ ఒక్క రాత్రికి రూ.ఎనిమిది లక్షలు కావటం చర్చనీయాంశమైంది. అహ్మదాబాద్, ఆగ్రా పర్యటనల అనంతరం రాత్రి అక్కడే ఉంటారు. అమ్మో అంత ఖర్చా! అని చాలా మంది నోరెళ్లబెతున్నారు. ‘పెద్దన్నంటే మాటలు కాదుగా మరి.ఆ మాత్రం ఉండాలి’ అనే ఎద్దేవాలకూ కొదవ లేదు. సిల్క్ ప్యానెల్డ్ గోడలు, వుడెన్ ఫ్లోరింగ్, అదిరిపోయే కళా కృతులు, ప్రత్యేకమైన భోజన శాల,విలాసవంతమైన శౌచాలయాలు, వ్యాయామ శాల, దేహ మర్ధన కేంద్రం, అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 55 అంగుళాల హై డెఫినిషన్ టీవీ, ఐపాడ్ డాకింగ్ స్టేషన్, ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రో బయోలాజికల్ లాబొరేటరీ, బయట వైపు గాలి విషతుల్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు కలిగి ఉండటం ఈ గది ప్రత్యేకతలు. గతంలో ఈ హోటల్లోనే అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్లు బస చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos