క్రికెట్‌కు హషీం ఆమ్లా వీడ్కోలు..

  • In Sports
  • August 9, 2019
  • 175 Views
క్రికెట్‌కు హషీం ఆమ్లా వీడ్కోలు..

క్రికెట్‌ ఆడే దేశాల జాబితాలో అగ్రశ్రేణి జట్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకటి.అయితే కొద్ది రోజులుగా జట్టులోని మేటి ఆటగాళ్లు ఒక్కొక్కరు ఆటకు వీడ్కోలు పలుకుతుండడం దక్షిణాఫ్రికా జట్టును కొంత కలవరపాటుకు గురి చేస్తోంది.క్రితం ఫాస్ట్‌బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ వీడ్కోలు మూడు రోజులకే స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ హషిమ్‌ ఆమ్లా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.దేశవాళీ క్రికెట్‌ మినహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమ్లా ప్రకటించాడు. 2004లో కోల్‌కతాలో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఆమ్లా ఇప్పటివరకు 124 టెస్టుల్లో 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు.టెస్టుల్లో 28 శతకాలు,41 అర్ధశతకాలు ఉండగా 311 అత్యధిక స్కోరు.ఇక ఇప్పటివరకు 181 వన్డేలు ఆడిన ఆమ్లా 49.46 సగటుతో 8,113 పరుగులు సాధించాడు.అందులో 27 శతకాలు,39 అర్ధశతకాలు బాదగా వన్డేల్లో ఆమ్లా అత్యధిక స్కోరు 159. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌-2019 శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ఆమ్లా కెరీర్‌లో చివరిది. ఇక లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న ఆమ్లా.. చివరకు ప్రపంచకప్‌ ముగియగానే వీడ్కోలు నిర్ణయం ప్రకటించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos