కాసేపట్లో బలపరీక్ష

కాసేపట్లో బలపరీక్ష

రాంచి: జార్ఖండ్లో జేఎంఎం నేత చంపయీ సొరేన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు కాసేపట్లో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్షలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ పాల్గొననున్నారు భారీ భద్రత మధ్య ఈ ఉదయం సోరెన్ను అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. మరోవైపు బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సైతం రాంచీ చేరుకున్నారు. బీజేపీ ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos