బెంగళూరులో జరిగిన విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగొచ్చు..

బెంగళూరులో జరిగిన విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగొచ్చు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న పలు నిర్ణయాలు మైనారిటీలను సంతృప్తి పరిచేలా ఉన్నాయంటూ సోము తాజాగా చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. మెజారిటీ వర్గాన్ని వదిలిపెట్టి మైనారిటీలే కావాలనుకుంటే బెంగళూరు తరహా ఘటనలే జరుగుతాయంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సోము ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి.2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొందరు ముస్లిం యువకులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొందరు ముస్లిం యువకులను అక్రమ కేసుల్లో నిర్బంధించిన కారణంగా వారు దాడి చేయడంపై అప్పట్లో టీడీపీ సర్కారు వీరిపై కేసులు పెట్టింది. ఈ కేసుల దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ తాజాగా జగన్ సర్కారు ఈ కేసులను ఉపసంహరించుకుంటూ హోంశాఖతో ఉత్తర్వులు ఇప్పించింది. అప్పట్లో ఈ ఘటనలో పాల్గొన్న యువకులపై నమోదైన కేసులన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తాజాగా జీవో జారీ చేశారు. దీనిపై సోము వీర్రాజు మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని ఆవహేళనచేస్తూ ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన నిందితులపై పెట్టబడిన కేసులను ఎత్తివేస్తూ సంఘవిద్రోహ శక్తులకు మరిన్నిఅవకాశాలను కల్పించటం ఈ రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అంటూ సోము ఇవాళ ట్వీట్ చేశారు.’ఇది పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తుంది.. ఇది చాలా దురదృష్టకరం.. ఇటువంటి నిర్ణయాలు బెంగళూరు నగరంలో జరిగిన దురదృష్టకర సంఘటనలు, దాడుల వంటివి మన రాష్ట్రంలో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తు లో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్తేర్ధ్యాన్ని దెబ్బతీస్తుందనటం లో ఏమాత్రం సందేహం అవసరం లేదంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos