మాట మార్చిన సోము వీర్ర్రాజు

మాట మార్చిన సోము వీర్ర్రాజు

అమరావతి : బిసి నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా నియమిస్తామనే ప్రకటన పై భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చారు. వైకాపా, తెదేపాలకు సవాల్ విసిరిన 24 గంటల్లోనే నాలుక్కరుచుకున్నారు. సిఎం అభ్యర్థిని తాను ప్రకటించబోనని.. అది అధిష్టనం నిర్ణయం అన్నారు. గురువారం బిసి ల అంశాలను ప్రస్తావించిన ఆయన ‘చంద్రబాబు నాయుడు బిసి ని ముఖ్యమంత్రిగా చేయగలరా ?జగన్మోహన్ రెడ్డి బిసి ని ముఖ్యమంత్రిగా చేయగలరా ? ఈ దేశంలో ఆ దమ్ము భా జ పాకే ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా’నన్నారు. శుక్రవారం మాట మార్చారు. ‘ భాజపా ఒక జాతీయ పార్టీ. ఎప్పుడూ ముఖ్యమంత్రిని జేపీ నడ్డా . మా మిత్ర పక్షమైన జనసేన నేత పవన్ కల్యాణ్ చర్చించి ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు. నేను ముఖ్యమంత్రి ఫలానా వర్గానికి అని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఆ విధంగా నేను చెప్పలేను’అని గొంతు సవరించారు. మొదట సోమువీర్రాజు చేసిన ప్రకటన రాజకీయ సంచలనంగా మారింది. ఇంతలోనే సోము వీర్రాజు మాట మార్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos