సేద్యం శాసనాల్ని సవరించాలి

సేద్యం శాసనాల్ని సవరించాలి

నెల్లూరు : నూతన వ్యవసాయ చట్టాల్ని సవరించి తీరాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి డిమాండు చేసారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ చట్టాల్ని చేసిందో కానీ సవరణల్ని చేయాల్సిన అవసరం ఉంది. కనీస మద్ధతు ధర ను చట్టబద్ధం చేయాలి. కార్పొరేట్ కంపెనీలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలోనూ కనీస మద్ధతు ధర ఒప్పందం జరగాలి. పేద రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రైవేటు సంస్థలు ఎంత సరుకునైనా నిల్వచేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదం ఉంది. వీటన్నింటిని పరిగణించి స్పష్టమైన సవరణలు చేయాలి. రైతుల విషయంలో కేంద్రం పట్టు విడుపులు చూపి సత్వర నిర్ణయం తీసుకోవాల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos