హోసూరు అటవీ ప్రాంతాల్లో సౌర కంచె

హోసూరు అటవీ ప్రాంతాల్లో సౌర కంచె

హోసూరు : హోసూరు అటవీ ప్రాంత గ్రామాలలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల బెడద నివారించడానికి అటవీ శాఖ అధికారులు 20 కి.మీ. మేరకు సౌర కంచెను ఏర్పాటు చేశారు. హోసూరు సమీపంలోని  సానమావు, రామాపురం, పాతకోట, పోడూ రు తదితర ప్రాంతాలలో పంటలను ఏనుగులు తరచూ ధ్వంసం చేస్తున్నందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల పంటలను కాపాడే దిశగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సానమావు, పోడూరు, బీర్జేపల్లి తదితర ప్రాంతాలలో సుమారు 20 కి.మీ. దూరం వరకు సౌర కంచెను ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రస్తుతం ఏనుగుల బెడద తగ్గిందని రామాపురం, పాతకోట, బీర్జేపల్లి గ్రామాలకు చెందిన రైతులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos