స్టాక్ మార్కెట్… రూ. 5 లక్షల కోట్ల నష్టం

స్టాక్ మార్కెట్… రూ. 5 లక్షల కోట్ల నష్టం

ముంబై : స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం వ్యాపారం ఆరంభమైన నిముషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా కూలిపోయింది. మదుపర్ల సంపద దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. 9.35 గంటలకు సెన్సెక్స్ 1,222 పాయింట్లు పడిపోయి, 3.25 శాతం నష్టంతో 36,354 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 348 పాయింట్లు పడిపోయి, 3.12 శాతం నష్టంతో 10,646 పాయింట్ల వద్ద ఉన్నాయి. నిఫ్టీ-50లో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, వీఈడీఎల్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు ఆరు శాతానికి పైగా నష్టపోయాయి. యస్ బ్యాంక్, బీపీసీఎల్, ఐఓసీ, సన్ ఫార్మా కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.61 వద్ద దాఖలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos