ఈ గుడి గ్రహణానికి అతీతం

ఈ గుడి గ్రహణానికి అతీతం

శ్రీ కాళహస్తి: గ్రహణ సమయాల్లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరచే ఉంచుతారు. ఇతర ఆలయాల్ని మూసి వేస్తారు. గ్రహణం తొలగిన తర్వాత శుద్ధి చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఛాయా గ్రహాలు రాహు,కేతువుల క్షేత్రం కావడం వల్ల ఆలయాన్ని మూసి వేయరు. భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య,చంద్రులను మింగి వేసే రాహు, కేతువుల నుంచి వెలువడే కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని భావించి ఇతర ఆలయాలను మూసివేస్తారు.శ్రీకాళహస్తి మూల విరాట్టుపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, తొమ్మిది రాశులు సౌర వ్యవస్థను నియంత్రి స్తుంటాయి. అందు వల్ల గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై పడదు. రాహు కేతు దోషం కలిగిన వారు గ్రహణసమయాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటే దోష పరిహారం జరుగుతుందని నమ్మకం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos