అబ్బబ్బా….ఏమి సిక్సు…

  • In Sports
  • March 11, 2019
  • 158 Views
అబ్బబ్బా….ఏమి సిక్సు…

మొహాలీ : క్రికెట్‌లో కేవలం బౌలింగ్‌కే పరిమితమైన ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణించడం మహా అరుదు. మరీ… బుమ్రా లాంటి వారైతే కొసమెరుపే. అందుకే బుమ్రా లాస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా రంగ ప్రవేశం చేస్తుంటాడు. మొహాలీలో ఆదివారం ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో బుమ్రా కేవలం చివరి బంతినే ఎదుర్కోవాల్సి వచ్చింది. దానిని అతను సిక్సర్‌గా మలచడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా బుమ్రా సిక్స్‌ కొట్టడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన ఈ సిక్సు అంతర్జాతీయ మ్యాచ్‌లో అతనికిమొదటిది. టీమిండియా సభ్యులు బుమ్రా సిక్సుకు చప్పట్లు కొడుతూ ఎగిరి గంతేస్తుండగా, కొహ్లి కూడా చప్పట్లు కొడుతూ అతనిని అభినందించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. అభిమానులు కూడా దీనిని చూసి సంబరపడిపోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos