యోగి పాలనలో చిన్నారులకు రక్షణ ఏదీ?

యోగి పాలనలో చిన్నారులకు రక్షణ ఏదీ?

ముంబై: చిన్నారులకు రక్షణ కల్పించడంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని శివసేన విమర్శించింది. యోగి సర్కారు తీవ్రంగా విఫలమైందని శివసేన పత్రిక-సామ్నా పత్రిక ఒక ప్రత్యేక కథనంలో ఆదిత్యనాథ్‌ పరిపాలన వైఖరిని ఏకి పారేసింది. ఆయన ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తీకరించింది. ‘ఢిల్లీలో 2012లో సంభవించిన నిర్భయ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.అప్పుడు ఆందోళన చేసిన వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు రాలేదు. ముఖ్యంగా యూపీలో చిన్నారులపై ఆత్యాచారాలు మరింత పెరిగాయి. ఇలాంటివి పునరావృతం కావటం చాలా దారుణం. చిన్నారుల రక్షణకు యోగి ప్రభుత్వం వెంటనే చర్యల్ని చేపట్టాలి. భేటీ బచావో. భేటీ పడావో నినాదంతో ముందుకెళ్లాలి. మానవత్వానికి మాయని మచ్చ అలీగఢ్ ఘటన’అని మండి పడింది. గత మే 30న కనిపించకుండా పోయిన టప్పల్‌ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లి దండ్రులు ఆరోపిం చారు. మూడు రోజుల తర్వాత జూన్‌ 2వ తేదీన బాలిక మృత దేహం ఆమె నివాసానికి సమీపంలోని చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్‌ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు జహీద్, అస్లాం అంగీక రించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. నిందితుల్లో ఒకరైన జహీద్ తన ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసాడు. ఈ కేసులో అరెస్టయ్యి బెయిల్ పై విడుదలయ్యాడు. మొత్తం అతనిపై నాలుగు కేసులు అతడికి వ్యతిరేకంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos