శివ కుమార్ ఆస్తులపై సిబిఐ దాడులు

శివ కుమార్ ఆస్తులపై  సిబిఐ దాడులు

బెంగళూరు : కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు డీకే శివకుమార్,ఆయన సోదరుడు డి.కె.సురేశ్ నివాసాలు కచ్చేరీలపై సోమవారం ఉదయం సిబిఐ ఎనిమిది బృందాలు ఏక కాలంలో సోదాల్ని ప్రారంభించాయి. ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ గతంలో శివకుమార్పై కేసులు నమోదు చేసింది. కర్నాటక, ముంబై ఇళ్లలోనూ సోదాలు జరిపారు. కర్ణాటకలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టినందుకు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సంసిద్ధం కాకుండా దెబ్బతీసేందుకు శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు చేయించారని ఆరోపించారు. మోదీ,యెడియూరప్ప ద్వయం కుట్ర కుతంత్రంతో సీబీఐ దాడులు చేయించిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, కర్నాటక వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సూర్జేవాలా విరుచుకుపడ్డారు. యెడియూరప్ప ప్రభుత్వంలో అవినీతిని సీబీఐ వెలికి తీయాలని సూర్జేవాలా డిమాండు చేసారు. నిరుడు సెప్టెంబరులో శివకుమార్ ను ఈడీ అరెస్టు చేసింది. పన్ను ఎగవేత, కోట్లరూపాయల హవాలా లావాదేవీలపై శివకుమార్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి అభియోగాలు మోపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos