కేంద్రం వాస్తవాల్ని అంగీకరించాలి

కేంద్రం వాస్తవాల్ని అంగీకరించాలి

ముంబై : దేశ రక్షణ విషయంలో వాస్తవాల్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే శివసేన అధికారిక పత్రిక-సామ్నాచురకలంటించింది. ‘చైనాపై పోరాడే విషయంలో దేశం మొత్తం కేంద్రం వెంటే ఉంది. కానీ చైనాను ఎదుర్కోవటంలో కేంద్రం వైఖరి ఏమిటి? దేశ రక్షణ విషయంపై కేంద్రం ఇతర రాజకీయ పక్షాలకూ తెలపాలి. సుశాంత్ మృతి, కంగనా కవేరజ్ తర్వాత దేశంలో మరో టాపిక్ ఏందని ప్రజలు అడుగుతున్నారు? ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత కశ్మీరీ పండితులను తిరిగి రప్పిస్తామని కేంద్రం వాగ్దానం చేసింది. ప్రస్తుతం అది ఏ దశలో ఉందో చెప్పాలి. మెరుపు దాడుల పేరిట ఎన్నికల్లో విజయం సాధించారు. కశ్మీరీ పండితుల సమస్య అలాగే ఉండిపోయింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు చాలా మారతాయని కేంద్రం పేర్కొందని, ఇప్పటికీ చాలా మంది జవాన్లు అమరులవుతూనే ఉన్నార’ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos