శివసేనకు సైనికుల షాక్‌

శివసేనకు సైనికుల షాక్‌

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార వాతావరణం వేడెక్కిన ప్రస్తుత తరుణంలో శివసేనను ఆ పార్టీ కార్పొరేటర్లు దిగ్భ్రాంతికి గురి చేసారు. సీట్ల పంపకాల పై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు, 300 మంది కార్య కర్తలు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు రాజీనామా పత్రాలను పంపించారు. పొత్తు ముంచేసింది. ఇది ఒక్కసారిగా రాజకీయంగా దుమారాన్ని లేపింది. శివసేన,భాజపాలకు తలనొప్పిగా మారింది. రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్థానిక నేత ధనంజయ్ బోడారేకు మద్దతుగా శివసేనకు దూర మైనట్లు విలేఖరులకు తెలిపారు. కళ్యాణ్ నియోజకవర్గాన్ని శివసేకు కేటాయించాలని కోరినా భాజపాకే కేటాయించటం స్థానికుల్లో అసంతృప్తికి కార ణం. కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి శివసేన, బీజేపీలో చేరిన నాయకులను ఎన్నికల బరిలోకి దింపటమూ ఆగ్రహానికి మరో కారణం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos