అన్నదాత ఆదర్శం

అన్నదాత ఆదర్శం

న్యూ డిల్లీ: స్థానిక నివాసి పప్పన్ సింగ్ పొలంలో అనేకమంది కూలీలు పని చేసేవారు. కరోనా కారణంగా వారందరూ బిహార్లోని సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు పప్పన్ సిగ్ తన సొంత ఖర్చులతోనే వారందరూ విమానంలో సొంతూళ్లకు చేరుకునే ఏర్పాట్లు చేశాడు పప్పన్ సింగ్. ఇప్పుడు వారందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం 21 విమాన టికెట్లు తీశాడు. ఒక్కో టికెట్ ధర రూ.5,200. కొందరు కూలీలు నా మీదే ఆధారపడి బతుకుతున్నారు. వారిని ఆదుకోవడం నా కర్తవ్యం. అందుకే 21 టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసి వారికి పంపించా. విమానాశ్రయం నుంచి వారిని తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేశాన’ని పప్పన్ సింగ్ పేర్కొన్నాడు. కూలీల కుటుంబ సభ్యులకూ అండగా ఉంటున్నాడు. కూలీలు, కుటుంబసభ్యులూ దిల్లీకి వచ్చే ఏర్పాట్లు చేశాడు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చులో సగాన్ని తానే భరిస్తున్నాడు. వారు పనిచేయకపోయినప్పటికీ పొలంలో పనిచేసే కూలీలతో కలిసి ఉంటారని వివరించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos