ఫిరాయంపులతో కమల ‘వికాసం’

ఫిరాయంపులతో కమల ‘వికాసం’

గ్యాంగ్టక్: సిక్కిం విధానసభ ఎన్నికల్లో ఒక్క చోటా గెలవని భాజపా మంగళవారం రోజులోనే రెండో అతిపెద్ద పార్టీగా మారింది. . ఇప్పటి వరకు విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు ఒకే సారి భాజపా తీర్థాన్ని పుచ్చుకు న్నారు.మంగళవారం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన వారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సిక్కింలో మొత్తం 32 శాసనసభ నియోజకవర్గాలున్నాయి.చట్టసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతి కారి మోర్చా 17 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎస్డీఎఫ్ నుంచి ఎన్నికైన సభ్యుల్లో ఇద్దరు రెండేసి స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఎస్డీఎఫ్ సంఖ్యా బలం 13కు పడిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos