కేంద్ర ఆర్థిక విధానాలతో రాష్ట్రం కుదేలు

కేంద్ర  ఆర్థిక విధానాలతో రాష్ట్రం కుదేలు

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోప భూయిష్ట విధానాల వల్ల కర్ణాటక ప్రభుత్వం ఆర్థికంగా చాలా నష్ట పోతోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య విమర్శించారు. శుక్ర వారం విధానసభలో పన్నుపోటు లేని మిగులు 2024-25 బడ్జెట్ ప్రతిపాదనల్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోది నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. అశాస్త్రీయంగా వస్తు సేవా పన్నుల వసూలు విధానం అమలు ,విపరీతంగా సెస్సు, సర్ ఛార్జీల పెంపు, నిధుల కేటాయింపు విధానంలో మార్పులు రాష్ట్రానికి ఆర్థికంగా పెను శాపాలుగా మారాయని మండి పడ్డారు. సర్ ఛార్జి, సెస్సుల్ని బాగా అధికం చేసినప్పటికీ ఆ పద్దుల కింద కేంద్రానికి రాష్ట్రం నుంచి రాబడి 2017-18 నుంచి 2023-24కి 153 శాతం పెరిగినా రాష్ట్రానికి ఆ మేరకు వాటా ఇవ్వకుండా మొండి చేయి చూపారని దుయ్య బట్టారు.ఇందువల్ల గత ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి రూ.45,322 కోట్ల ఆదాయానికి గండి పండిందని గణాంకాలో సహా వివరించారు. దీనికి తోడు దేశంలో నిరుద్యోగం, నిత్యాసర సరకుల ధరలు, సమాజంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయని ఆక్రోశించారు. పర్యవసానంగా రాష్ట్రాలు సంక్షేమ పథకాలకు కోసం నిధుల్ని ఎక్కువగా కేటాయించటం అనివార్యమైందన్నారు. ఇది రెవిన్యూ లోటుకు దారి తీస్తుందని చెప్పారు. రెవిన్యూ మిగుల సాధించటాని కంటే పేదల ఆకలి బాధల్ని తీర్చటానికే తమ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక విధానాల్ని సమర్థించుకున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల్ని రూ.1,20,373 కోట్లకు అధికం చేసామని వివరించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు రూ.1,05,246 కోట్లు రుణాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
మిగులు బడ్జెట్:
బడ్జెట్ వ్యయం రూ.3,71,382 కోట్లు కాగా రాబడి రూ.2,63,178 కోట్లు. ఇతర నిర్వహణ ఖర్చులుపోగా
మిగులు రూ.3,849 కోట్లు. నిధుల సమీకరణ, వ్యయాల్లో ఎక్కడా ఆర్థిక క్రమ శిక్షణకు గండి పడకుండా జాగ్రత్త పడినట్లు చెప్పారు. ద్రవ్య లోటు రూ.82,981 కోట్లు . ఇది రాష్ట్ర స్థూలోత్పత్తిలో2.95 శాతం. 2024-25 ఆఖరుకు మొత్తం రుణ భారం రూ.6,65,095 కోట్లుకు చేరుతుంది. అదీ మొత్తం రాష్ట్ర స్థూలోత్పత్తిలో పాతిక శాతాన్ని మించదని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos