శృతి హాసన్‌కు లండన్‌ యువత ఫిదా..

  • In Film
  • May 8, 2019
  • 145 Views
శృతి హాసన్‌కు లండన్‌ యువత ఫిదా..

లోకనాయకుడు కమల్‌హాస్‌ గారాలపట్టీ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం అందరికి తెలిసిందే.నటనతో పాటు సంగీతం,డాన్స్,సింగింగ్లో కూడా శృతి హాసన్ నిష్ణాతురాలనే ఇప్పటికి అనేకసార్లు రుజువైంది.సినిమాల పరంగా కెరీర్ పీక్స్లో ఉండగానే యాక్టింగ్కు వీడ్కోలు పలికి మాజీ ప్రేమికుడు మైఖెల్ కొర్సలెతో కలసి రాకబ్యాండ్ ఏర్పాటు చేసి విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే మైఖెల్ కొర్సలెతో విడిపోయిన అనంతరం కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న శృతి మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపించాయి.అందుకు తగ్గట్లే విజయ్ సేతుపతితో కలసి కొత్త చిత్రంలో నటించడానికి శృతి సిద్ధమైంది. ఈ తరుణంలో మరోసారి లండన్ నగరంలో శృతి చేసిన సంగీత ప్రదర్శన హాట్ టాపిక్గా మారింది.మైఖెల్‌తో విడిపోయాక లండన్ నగరంలో ఒంటరిగా శృతి చేసిన గాన కచేరికి లండన్ యువత నుంచి విశేష స్పందన దక్కింది.శృతి పాటలకు లండన్ యువత ఫిదా అయ్యారంటూ లండన్ మీడియా కథనాలు ప్రచురించింది. విజయ్ సేతుపతి సినిమాలో నటించడానికి శృతి అంగీకరించడంతో తెలుగు, తమిళ,హిందీ నిర్మాతలు శృతిని సంప్రదించగా ఇకపై సంగీత,గాన కచేరిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించుకున్నానని స్పష్టం చేయడంతో శృతికి ఇక సినిమాల్లో నటించే ఆసక్తి లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

View this post on Instagram

Such a great night 🖤

A post shared by @ shrutzhaasan on

తాజా సమాచారం

Latest Posts

Featured Videos