తృటిలో తప్పించుకున్న శ్రియా..

  • In Film
  • December 11, 2019
  • 112 Views
తృటిలో తప్పించుకున్న శ్రియా..

ఇష్టం చిత్రంతో రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రియా సరన్‌ ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది.వయసు పెరిగినా శ్రియా అందం ఇనుమడిస్తోందే తప్ప తగ్గడం లేదు.తాజాగా సందకారి అనే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న శ్రియా లండన్‌లో విపత్కర పరిస్థితి నుంచి తృటిటో తప్పించుకుంది.లండన్ విమానాశ్రయ పరిసరాల్లో చిత్రీకరిస్తుండగా శ్రియ ఒక్కసారిగా హై సెక్యూరిటీ జోన్ లో ప్రవేశించిందివెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు తుపాకీ గురిపెట్టి అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో శ్రియ షాక్‌కు గురైంది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తగిన అనుమతి పత్రాలు చూపించడంతో లండన్ పోలీసులు శాంతించారు.లండన్ పోలీసుల నుంచి ఊహించని పరిస్థితి ఎదురు కావడంతో శ్రీయ ఓ రకమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ప్రాణప్రాయం నుంచి క్షేమంగా బయపడటాన్ని నమ్మడానికి చాలా సమయం పట్టిందట. చిత్ర యూనిట్ అందించిన సపోర్ట్‌తో మాములు పరిస్థితికి రావడానికి చాలా సమయం పట్టినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos