విచారణకు రాలేనన్న శివాజీ

  • In Crime
  • July 11, 2019
  • 144 Views
విచారణకు రాలేనన్న శివాజీ

హైదరాబాద్ : అలంద మీడియా కేసులో విచారణకు హాజరు కాలేనని సినీ నటుడు శివాజీ తెలిపారు. గురువారం సైబరాబాద్ పోలీసుల ఎదుట విచారణ జరగనున్న నేపథ్యంలో మెయిల్ ద్వారా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడిని అమెరికా పంపుతున్నందున హాజరు కాలేనని పేర్కొన్నారు. అలంద మీడియా ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో శివాజీపై కేసు నమోదైంది. తదనంతరం ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. వారం కిందట ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos