జపాన్ ప్రధాని భారత్‌ పర్యటన రద్దు

జపాన్ ప్రధాని భారత్‌ పర్యటన రద్దు

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ వల్ల ఈశాన్య భారతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినందున ఆదివారం భారత పర్యటనకు రావాల్సిన జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన రద్దు కానుంది. జపాన్ కు చెందిన జిజి ప్రెస్ దీన్ని వెల్లడించింది. ఆది వారం అసోం రాజ ధాని గౌహతిలో షింజో అబే, నరేంద్ర మోదీ మధ్య చర్చలు జరగాల్సి వుంది. అప్పుడు అసోంలో పరిస్థితులు అను కూ లంగా ఉండబోవని భావించిన అబే ఇండియాకు రాదలచేకోలేదని సమాచారం. ఇండియాకు రావాల్సిన బంగ్లాదేశ్ విదేశీ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, హోమ్ మంత్రి అసదు జ్జామన్ ఖాన్ లు తమ మేఘాలయ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు ఏర్పడగా, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos