బహిరంగ చర్చకు షాకు సవాల్‌

బహిరంగ చర్చకు షాకు సవాల్‌

న్యూఢిల్లీ: గడువులోగా భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించ లేకపోయినందున తనతో బహిరంగ చర్చకు రావాలని లంటూ హోం మంత్రి అమిత్ షా అమిత్ షాకు బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.‘బహిరంగ చర్చ అనేది ఎప్పుడూ మంచి దేనని. వచ్చి చర్చలో పాల్గొనాలి. ఢిల్లీ ప్రజల సమక్షంలో శనివారం చర్చ జరుపుదామ’ని చెప్పారు. మాకు ఓటు వేయండి, మీకు ముఖ్యమంత్రిని ఇస్తా మని అమిత్ షా చెబుతున్నారని. అసలు భాజపాకు ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని ఢిల్లీ తెలుసు కోదలచింది. శహీన్ బాగ్ రోడ్డును ఎందుకు తెరవ లేదనే విషయాన్ని అమిత్ షా నుంచి ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాల నుకుంటున్నారు. ఎందుకు ఇంత నీచ రాజకీ యాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీ కుమారుడినైన నేను టెర్రరిస్టును ఎలా అయ్యాను? మనోజ్ తివారి, స్మృతి ఇరానీ, హర్దీప్ పూరి, విజ య్ వీరిలో ఎవరు మీ సీఎం అభ్యర్థి’ అని ఎద్దేవా చేశారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట లోగా ప్రకటించాలని కేజ్రీవాల్ మంగళవారం సవాలు విసిరారు.

తాజా సమాచారం