లండన్‌ వెళ్లిన నవాజ్‌ షరీఫ్‌

లండన్‌ వెళ్లిన నవాజ్‌ షరీఫ్‌

లాహోర్: చికిత్స కోసం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఎట్టకేలకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా మంగళవారం లండన్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నాలుగు వారాల పాటు ఉండేందుకు లాహోర్ ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఆయన వెంట ఆయన తమ్ముడు షాబాజ్ షరీఫ్, వ్యక్తిగత వైద్యుడు ఉన్నారు. దోహ నుంచి ఖతార్ మీదుగా లండన్కు తరలించారు. అక్కడి హరేలీ స్ట్రీట్ క్లినిక్కు తీసుకుని వెళ్తారు. మరీ అవసరమైతే అక్కడి నుంచి అమెరికాలోని బోస్టన్కు తరలించవచ్చని పీఎంఎల్ఎన్ ప్రతినిధి మారియమ్ తెలిపారు. ఆరోగ్య పరిస్థితి లండన్ వెళ్లే వరకు స్థిరంగా ఉండేందుకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు, మందులు ఇచ్చినట్లు తెలిసింది. లండన్ వెళ్లేందుకు షరీఫ్ రూ.700 కోట్ల పూచీకత్తుపై అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఆయన ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos