లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్ని మూట గట్టుకున్నాయి. ఆగస్ట్ 31 తర్వాత సెన్సెక్స్ మరోసారి 40 వేల మార్కును అధిగమించింది. రూ. 16 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ను టీసీఎస్ ప్రకటించడంతో మదుపర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఒక దశలో సెన్సెక్స్ 40,469కి ఎగబాకింది. మదుపర్లు లాభాల బుకింగ్ కు మొగ్గు చూపడంతో లాభాలు పడి పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 40,183కి, నిఫ్టీ 96 పాయింట్లు పుంజుకుని 11,835కి చేరాయి.బీఎస్ఈ లో అల్ట్రాటెక్ సిమెంట్ (3.24%), టీసీఎస్ (3.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.63%), ఇన్ఫోసిస్ (2.57%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.56%) భారీగా లాభాల్ని గడించాయి. ఓఎన్జీసీ (-2.84%), ఐటీసీ (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.81%), ఎల్ అండ్ టీ (-0.75%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.69%)నష్టపోకాయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos