వాహ్‌ వాట్సన్‌..నిజంగానే వృద్ధ ’సింహం’

  • In Sports
  • May 14, 2019
  • 162 Views
వాహ్‌ వాట్సన్‌..నిజంగానే వృద్ధ ’సింహం’

ఈ సీజన్ కి ఐపీఎల్ ముగిసింది. నాలుగోసారి ముంబయి ఇండియన్స్…ఐపీఎల్ కప్ ని చేజిక్కించుకుంది.50 రోజుల పాటు సాగిన ఐపీఎల్‌లో ఏవో కొన్ని మ్యాచ్‌లు మినహా ప్రతీ మ్యాచ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను తలపిస్తూ చివరి ఓవర్‌ చివరి బాల్‌ వరకు వెళ్లాయి.ఆదివారం ముంబయి ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ మిగిలిన అన్ని మ్యాచ్‌ల కంటే మరింత వినోదాన్ని పంచింది.ఐపీఎల్‌లో అసలు సిసలైన మజాను క్రికెట్‌ ప్రేమికులకు రుచి చూపింది.చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠతో ఇరు జట్లతో విజయం దోబూచులాడుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం ముంబయినే వరించడంతో నాలుగువ సారి ముంబయి ఇండిన్స్‌ ఐపీఎల్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది.కాగా  ఈ మ్యాచ్ లో చెన్నైని గెలిపించడానికి వాట్సన్ పడిన శ్రమ అందరినీ ఆకట్టుకుంది. అయితే… ఈ మ్యాచ్ లో వాట్సన్…తన కాలికి రక్తం కారుతున్నా… ఆటని కొనసాగించాడని చాలా ఆలస్యంగా తెలిసింది.మ్యాచ్ అయిపోయాక ఈ విషయాన్ని హర్భజన్ సింగ్… ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అతడి పోరాటపటిమను మెచ్చుకున్నాడు. ఎడమ మోకాలి ప్రాంతం రక్తంతో తడిసినా పట్టించుకోకుండా బ్యాటింగ్‌ చేస్తున్న వాట్సన్‌ ఫొటోను కూడా అతడు పెట్టాడు. మ్యాచ్‌ సందర్భంగా అతడు తన గాయం గురించి ఎవరికీ చెప్పలేదని భజ్జీ చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం వాట్సన్‌ గాయానికి ఆరు కుట్లు పడ్డాయని తెలిపాడు.హర్భజన్ పోస్టుకి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వాట్సన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆట మీద అతనికి ఉన్న అంకిత భావాన్ని చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విషయం తెలిసి చెన్నై ఫ్రాంచైజీ కూడా  కోప్పడిందట. అంత బాధలో ఎలా బ్యాటింగ్ చేశావని ప్రశ్నించదట. మాటమాత్రమైనా ఎందుకు చెప్పలేదని – ఏమైనా అయితే పరిస్థితి ఏంటంటూ కోప్పడిందట. ఇక అభిమానులు సైతం వాట్సాన్ ను ప్రేమగా కోప్పడుతున్నారు. ప్రపంచకప్ ముందుంచుకుని ఇలాంటి పిచ్చిపనులు ఏంటని – ఇంకోసారి ఇలా చేయొద్దని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా తన జట్టును గెలిపించాలనే వాట్సన్ తాపత్రయం ముందు ఓటమి కూడా ఓడిపోయిందంటూ అభిమానులు కీర్తిస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos