కమలంలోకి తెరాస ఎమ్మెల్యే?

కమలంలోకి తెరాస ఎమ్మెల్యే?

కొద్ది కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే తెలంగాణలో బీజేపీ పాచికలు పారేలా కనిపిస్తున్నాయి.తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు కేసీఆర్ అంటే భయం భక్తి కనబరచిన తెరాస నేతలు,ఎమ్మెల్యేలు కొద్దికొద్దిగా కేసీఆర్పై నిరసన గళం విప్పుతున్నారు.లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ధీమాతో బీజేపీ తెరాసను లక్ష్యంగా చేసుకొని దూకుడుగా వ్యవహరిస్తుండడంతో తెరాస నేతల్లో కొత్తగా ధైర్యం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తెరాస నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు తెరాసలో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడు,బోదన్ తెరాస ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలవడం చర్చనీయాంశమైంది.తెరాసలో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే అయిన తనకు మంత్రివర్గంలో స్థానం ఖాయం అనుకున్న షకీల్ మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అర్వింద్తో సుదీర్ఘ సమావేశం అనంతరం దీనిపై ఇరువురు నోరు మెదపకపోయినా సన్నిహిత వర్గాలు మాత్రం త్వరలోనే షకీల్ పార్టీ మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos