హిందీకి ద్వితీయ హోదానే : అమిత్ షా వివరణ

ఢిల్లీ : ఒకే దేశం, ఒకే భాష వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజాగ్రహానికి తలొగ్గారు. మాతృ భాష తర్వాత హిందీని ద్వితీయ భాషగా మాత్రమే నేర్చుకోవాలని తాను సూచించానని మాట మార్చారు. దీనిపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను హిందీ మాట్లాడని గుజరాత్‌ నుంచి వచ్చానని గుర్తు చేశారు. ఇటీవల హిందీ దివస్‌ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యగా దక్షిణ రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఆరు, ఏడు దశకాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తమిళనాడులో అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసే నటుడు రజనీకాంత్‌ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, నటుడు ప్రకాశ్‌ రాజ్‌లు షా వ్యాఖ్యలను తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos