ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

ముస్లిం మహిళలపై  అనుచిత వ్యాఖ్యలు

భువనేశ్వర్: ఒడిశా శాసన సభలో భాజపా ఉపనాయకుడు బిష్ణు సేథి సభ్యుడు ముస్లిం మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యాలు రాద్ధాంతాన్ని సృష్టించింది. రాజ్యసభలో ముమ్మారు తలాఖ్ ముసాయిదా ఆమోదం గురించి జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబై, కోల్కతా వేశ్యా వాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్, బీజేడీ సభ్యుల తీవ్రంగా ఖండించారు. దాఖలాల నుంచి సేథి వ్యాఖ్యాల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్కతాల్లోని రెడ్లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని సేథీ తన వ్యాఖ్యల్ని సమ ర్థించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos