వైఎస్‌ విగ్రహానికి నిప్పు..

వైఎస్‌ విగ్రహానికి నిప్పు..

రాజధాని మార్పుపై అమరావతి ప్రజలు,ప్రభుత్వం మధ్య రగడ తారాస్థాయికి చేరుకుంది. సీఎం జగన్ తాను అనుకున్నట్టు మూడు రాజధానుల ప్రకటన చెయ్యటమే కాదు అసెంబ్లీలో బిల్లు ఆమోదం కూడా పొందేలా చేశారు. దీంతో రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వ కార్యాకలాపాలు అన్నీ విశాఖ వేదికగానే జరుగుతాయని పేర్కొన్నారు.దీంతో అమరావతి ప్రజలు,రైతులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అమరావతి పరిధిలోని దొండపాడు గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో, ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న రాత్రి కొందరు ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుండగా, విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు, దొండపాడుకు అదనపు బలగాలను తరలించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos