మునిగిన మార్కెట్లు

మునిగిన మార్కెట్లు

ముంబై: మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 297.55 పాయింట్లు కోల్పోయి 37,880.40 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78.80 పాయింట్లు కోల్పోయి 11,234 వద్ద ఆగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.03గా దాకలైంది. నష్టాలతోనే ప్రారంభమైన వ్యాపారంలో మరింత నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,300 పాయింట్లకు దిగువకు పతనమైంది. విదేశీ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం బ్యాంకింగ్ షేర్లను బాగా ప్రభావితం చేసింది. 2019-20 స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటును ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ 6.2 నుంచి 5.8 తగ్గిం చడం కూడా మార్కెట్ నమ్మకాన్ని దెబ్బ తీసింది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, గెయిల్, టాటా మోటార్స్, వేదాంత షేర్లు నష్ట పోయాయి. భారతీ ఎయిర్టెల్, గ్రాసిం, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్ షేర్లు లాభాలు పొందాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos