చివరిరోజుల్లో ఎన్టీఆర్కు భోజనం కూడా పెట్టలేదు…

  • In Film
  • February 22, 2019
  • 172 Views
చివరిరోజుల్లో ఎన్టీఆర్కు భోజనం కూడా పెట్టలేదు…

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చివరిరోజుల్లో
కన్నకొడుకులు నరకం చూపించారంటూ సీనియర్‌ పాత్రికేయులు తిప్పరాజు రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు
సంచలనం సృష్టిస్తున్నాయి.కృష్ణ జిల్లా నిమ్మకూరు సమీప గ్రామానికి చెందిన రమేశ్‌ తిప్పరాజు
ఎన్టీఆర్‌ బతికి ఉన్నపుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు.ఎన్టీఆర్‌ చివరిరోజులు చాలా
దుర్భరంగా గడిచాయని కన్నకొడుకులు చివరిరోజుల్లో ఎన్టీఆర్‌కు ఒకపూట భోజనం కూడా పెట్టలేదంటూ
ఆరోపించారు.ఎన్టీఆర్ ఆస్తులు పంచుకున్న కుమారులు ఆయన ఆశయాలు పంచుకోలేదని..కనీసం ఆ ఆస్తులను కాపాడుకోలేని దుస్థితిలో ఆయన వారసులున్నారని రమేశ్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.తన తోటి హీరల వారసులు తమ తండ్రులు తమకిచ్చిన ఆస్తులను రెట్టింపు చేసుకుంటూ వెళితే
ఎన్టీఆర్‌ వారసులు మాత్రం అందుకు భిన్నంగా ఆస్తులను కాపాడుకోలేక అప్పులపాలయ్యారంటూ
విమర్శించారు.చివరకు చెన్నైలోని ఎన్టీఆర్‌ ఇంటిని సైతం కాపాడుకోలేక ఆ ఇంటిని కూడా అమ్మేశారని
అలనాటి హీరోల వారసులు తెలుగు చిత్ర పరిశ్రమలు కీలకపాత్ర వహిస్తుంటే ఎన్టీఆర్‌ వారసుల్లో
బాలకృష్ణ మినహా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు.ఎన్టీఆర్‌
జీవితాన్ని బయోపిక్‌గా తీసి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ పరువు తీసేసాడని విమర్శించారు.అధికారం
లాక్కోవడానికి చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినా,తెదేపాను తన అధీనంలోకి
తీసుకుంటున్నా,గండిపేట ఆశ్రమాన్ని లాగేసుకున్నా ఎన్టీఆర్‌ వారసుల్లో ఏఒక్కరు కూడా నోరు
మెదపకుండా ఉన్నారని విమర్శించారు.ఎన్టీఆర్‌పై జీవితంపై బాలకృష్ణ తీసిన బయోపిక్‌ అంతా
నాటకమని రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించేదే అసలు వాస్తవమని రమేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ తో రామారావు గారిని పరువును నిలబెట్టే ప్రయత్నం వర్మ చేస్తున్నాడని రమేశ్ బాబు కామెంట్స్ చేశాడు.ఎన్టీఆర్ ను చివరి నిమిషంలో ఎవ్వరూ పట్టించుకోలేదని.. కనీసం ఒక్క పూట కూడా అన్నం పుట్టలేదని.. ఒక్క పూట ఎన్టీఆర్ కు అన్నం పెడితే 
ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకొని ఉండేవారు కాదని రమేష్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. కొడుకులను ఎంతో బాగా చూసుకున్న ఎన్టీఆర్ ను చివర్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు.  బసవతారకం చనిపోయాక కొడుకలందరూ కనీసం తండ్రికి ఒక్క పూట భోజనం పెట్టలేదని రమేశ్ బాబు ధ్వజమెత్తారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos