చిరునవ్వుల చిన్నమ్మ ఇక లేరు..

చిరునవ్వుల చిన్నమ్మ ఇక లేరు..

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌(67) తీవ్రగుండెపోటుతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు.సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణ రాజకీయ ప్రముఖులతో పాటు యావత్‌ దేశ ప్రజలను సైతం షాక్‌కు గురి చేసింది.ఎప్పుడు చిరుదరహాసంతో కనిపిస్తూ ప్రత్యర్థుల ఆరోపణలను అపరకాళిలా చీల్చిచెండాడుతూ కష్టం అంటూ ఎవరైనా చేతులు చాస్తే వెంటనే సహాయ హస్తం చాచే చిన్నమ్మ ఇక లేరు అనే చేదువార్తను ప్రజలు నమ్మలేకపోతున్నారు. 1952 ఫిబ్రవరి 14 తేదీన హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జన్మించిన సుష్మా స్వరాజ్ అతిచిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా కేంద్రమంత్రిగా ఎదిగారు.గత మంత్రి వర్గంలో విదేశాంగశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన సుష్మా స్వరాజ్‌ విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను స్వస్థలాలకు క్షేమంగా తీసుకురావడంతో పాటు వైద్యం కోసం వీసా దరఖాస్తు చేసుకున్న పాకిస్థానీయులకు సైతం వీసా జారీ చేసి పెద్ద మనసు చాటుకున్నారు.1970లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నిరసిస్తూ సుష్మా స్వరాజ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1977లో ఎమ్మెల్యేగా గెలిచి 25 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అతిచిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.1990లో రాజ్యసభలో అడుగుపెట్టిన సుష్మా 1996లో లోక్‌సభలో అడుగుపెట్టారు.1998లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో హాజ్‌ఖాస్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుష్మా అదేఏడాది ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. 1996,1998లలో వాజ్పేయ్ కేబినెట్ లో మంత్రిగా విధులు నిర్వర్తించిన సుష్మా అప్పట్లో పార్లమెంట్‌ సమావేశాలను లైవ్‌లో ప్రసారం చేయాలంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1999 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుండి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీపై సుష్మా స్వరాజ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014-19 మోడీ కేబినెట్ లో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ నిర్వహించిన మహిళగా సుష్మా స్వరాజ్ ప్రసిద్ది చెందారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో కూడా సుష్మా పాత్ర ఎంతో కీలకం.2019-14 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషించిన సుష్మా తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు.పార్లమెంటు లోపల,బయట జరిగే చర్చలతో పాటు తెలంగాణలో పలుప్రాంతాల్లో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందగానే ఆ అమ్మ సోనియమ్మనే కాదు తెలంగాణ ఏర్పాటుకు సహకరించి ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ నేతలతో సుష్మా అన్న మాటలు తెలంగాణ నేతల చెవుల్లో ఇంకా రివ్వుమనిపిస్తూనే ఉన్నాయి. 1975 జులై 13 సుష్మ క్రిమినల్న్యాయవాది స్వరాజ్కౌశల్ను వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్గా కౌశల్పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మకౌశల్దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్ఫర్డ్విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్పూర్తిచేశారు.
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి సంతాపం..
సుష్మా
స్వరాజ్ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశం గొప్ప ప్రజాదరణ ఉన్న నేతను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. పాలనా దక్షత ఉన్న నేత, గొప్ప పార్లమెంటేరియన్‌, మంచి వక్త అయిన సుష్మా స్వరాజ్మృతి తీరనిలోటు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.
గొప్ప అధ్యాయం ముగిసింది..
సుష్మాజీ అస్తమయంతో భారత రాజకీయాల్లో గొప్ప అధ్యాయం ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఆమె అద్భుత కార్యదక్షత కలిగిన నేత. ఆమె నిర్వహించిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారన్నారు. వివిధ దేశాలతో భారత్సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారు. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే ఆమె వెంటనే స్పందించి సాయం అందించేవారని గుర్తు చేసుకున్నారు. సందర్భంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ భర్తను పరామర్శిస్తుండగా ఆయన కళ్లు చెమర్చాయి. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. భాజపా సీనియర్నేత సుష్మా స్వరాజ్పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. ‘సుష్మాజీ నాకే కాదు.. యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానుఅని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం..
మాజీ
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం ప్రకటించారువివిధ హోదాల్లో సుష్మా స్వరాజ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుష్మా స్వరాజ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సుష్మా స్వరాజ్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.
మోదీని ప్రశంసిస్తూ చివరి ట్వీట్‌..
మాజీ
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధానమంత్రి మోడీని అభినందిస్తూ ట్వీట్ చేశారులోక్ సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత సుష్మాస్వరాజ్ ట్విట్టర్ వేదికగా ఆమె మోడీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో రోజు కోసమే తాను వేచి చూసినట్టుగా ఆమె ట్వీట్ చేశారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో బిల్లు ఆమోదించారు. బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.మోడీని అభినందిస్తూ ఆమె ట్వీట్ చేశారు. తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్ మృతి చెందారు.ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నాలుగు గంటల క్రితం చివరి ట్వీట్ చేశారు. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లు ఆమోదం పొందగానే ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. జీవితంలో తాను రోజు కోసమే ఎదురుచూశానని సుష్మ ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌ మంత్రి సంతాపం..
బీజేపీ
సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఆమె గుండె పోటు కారణంగా మృతి  చెందిన సంగతి తెలిసిందే. కాగాఆమె మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సుష్మా హఠాన్మరణంపై ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  ట్విట్టర్ లో తనతో ఫైట్ చేసే గొప్ప వ్యక్తిని కోల్పోయాను అంటూ ఎంతో భావోద్వేగంతో ఆయన ట్వీట్ చేశారు. హక్కుల  కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా అంటూ కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు.కాగా పాకిస్తాన్‌లో హిందూ బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్‌ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్‌లో వాగ్యుద్ధం జరిగింది. ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని ఇండియన్‌ కమిషనర్‌ను సుష్మా ఆదేశించారు. దీనిపై  ఫవాద్‌ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్‌ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్‌ పాలనలోని కొత్త పాక్‌. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్‌లో బదులిచ్చారు.

బాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం..
సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో బాలీవుడ్‌ సైతం మూగబోయింది.చిన్నమ్మ హఠాన్మరణంపై బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర విచారం,సంతాపం వ్యక్తం చేశారు. ఓ గొప్ప రాజనీతికలిగిన నేత, దిగ్గజ నాయకురాలు మనల్ని విడిచివెళ్లారన్న విషాద సమాచారం తమను బాధించిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్మెగాస్టార్అమితాబ్బచన్సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్అద్భుత పార్లమెంటేరియన్‌, మంత్రి అంటూ కొనియాడిన బాలీవుడ్దర్శకుడు అనురాగ్కశ్యప్అత్యున్నత సేవలు అందించిన ఆమెను మిస్అవుతున్నామని అన్నారు.సుష్మా స్వరాజ్జీ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అనుష్క శర్మ ట్వీట్చేశారు.సుష్మాజీ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె తమకు ఎప్పటి నుంచో అత్యంత సన్నిహితురాలిగా మెలిగేవారని, తమ పట్ల ఆప్యాయత కనబరిచేవారని సంజయ్దత్గుర్తుచేసుకున్నారు. దిగ్గజ నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మా హఠాన్మరణంపై ప్రముఖ గాయకురాలు లత మంగేష్కర్‌ స్పందించారు సుష్మాజీ మరణ వార్త నన్ను షాక్కు గురిచేసింది. ఒక గొప్ప, నిజాయతీ గల నాయకురాలు. ఆమె సున్నితమైన, స్వార్థం లేని, అర్థం చేసుకునే మనసే ఆమెను ఉన్నత స్థానంలో ఉంచింది. నా మంచి స్నేహితురాలు నన్ను వదిలి వెళ్లిపోయారన్నారు.ఐరన్లేడీ. దేశభక్తి మాత్రమే కాకుండా అనిర్వచనీయ స్ఫూర్తి. మా అందరికీ ఆదర్శవంతమైన మీరు మా మధ్య లేరు. ఇది మాకు తీరని లోటని నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్మరణ వార్త నన్నెంతో బాధించింది. దేశానికి ఆమె చేసిన సేవలు, ఆమె చిత్తశుద్ధి వెలకట్టలేనివి. ఆమె సేవలను ప్రజలు మర్చిపోరు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లె సానుభూతి వ్యక్తం చేశారు. ప్రియమైన సుష్మా స్వరాజ్మరణ వార్త నన్నెంతో బాధ పెట్టింది. ఆమె మార్గదర్శకంలో నేనుగర్ల్చైల్డ్‌’కి బ్రాండ్అంబాసిడర్గా పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నాకున్న వ్యక్తిగత సంబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ టెన్నీస్‌ క్రీడాకారణి సానియా మిర్జా తెలిపారు.

ఎటువంటి సమస్యనైనా చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటూ ఎన్ని అడ్డంకులు,ఆటుపోట్లు ఎదురైనా ఇచ్చిన మాటపై నిలబడే మనస్తత్వం,ధైర్యం కలిగిన సుష్మా స్వరాజ్‌ వంటి చిన్నమ్మను ఇకపై చూడగలమో లేదో.ప్రతిఒక్కరి మనసులోనూ చెరగని ముద్ర వేసుకొని దివిసీమలకెగిసిన చిరునవ్వుల చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి భారతీయుడు ఉద్వేగంతో,బాధాతప్త హృదయంతో కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు..

 

 

 

 

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos