కులదీప్ సింగ్‌ ను ఎప్పుడు ఉరేస్తారు?

కులదీప్ సింగ్‌ ను ఎప్పుడు ఉరేస్తారు?

లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావ్ అత్యాచారి శాసనసభ్యుడు కులదీప్ సింగ్ సెంగార్ను ఎప్పుడు ఉరి తీస్తారాని బాధితు రాలు శనివారం ఇక్కడ ప్రశ్నించారు. కులదీప్ సింగ్ను న్యాయస్థానం నేరగాడుగా తేల్చింది. తీర్పు పట్ల బాధి తురాలు హర్షించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బాధితు రాలి సోదరి తెలిపారు. ‘నేను తీర్పు గురించి ఆమెకు చెప్పాను. ఆమె సంతోషించింది. దోషిని ఎప్పుడు ఉరితీస్తారని అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేద’ ని బదులిచ్చినట్లు వివరించారు. ‘ఇప్పటికే మా తండ్రిని, మరో సమీప బంధువుని కోల్పో యాం. మని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులు ఎప్పటికీ స్వేచ్ఛగా రోడ్డుపై తిరగకుండా చూడాలి. ఒక వేళ నేరగాడు బయటికొస్తే మా కుటుంబానికి ముప్పు తప్పద’ని వాపోయారు. ‘మా కుటుంబాన్ని నాశనం చేశారు. న్యాయం కోసం పోరాడినందుకు మా వా ళ్లను పొట్టన బెట్టుకున్నార’ని బాధితురాలి తల్లి ఆవేదన చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos