ఉపాధ్యాయిని బదిలీ : భోరుమని విలపించిన విద్యార్థులు

ఉపాధ్యాయిని బదిలీ : భోరుమని విలపించిన విద్యార్థులు

(రమేష్‌ రెడ్డి)

చిత్తూరు జిల్లా శాంతిపురం మండల  పరిధిలోని సి.బండపల్లి జడ్‌పీ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయిని టీ. వేదవతి బుధవారం బదిలీపై వెళ్తుండగా విద్యార్థులు భోరుమని విలపిస్తూ ఆమెకు వీడ్కోలు పలికారు. వేదవతి లాంటి ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేసేవారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మూడేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. సి.బండపల్లి  పాఠశాలకు బదిలీ అంటే అందరూ పనిష్మెంట్‌గా భావించేవారు. పాఠశాల అభివృద్ధికి వేదవతి సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు. డాక్టర్ అంబేద్కర్ మినీ స్టేడియం నిర్మించారు. పిల్లలకు మంచి నీటి కోసం రూ.అరవై వేలతో వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారని ప్రధానోపాధ్యాయుడు రాజకుమార్ తెలిపారు.  పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకునేవారని, వారికి ప్రేమానురాగాలు పంచిందని వివరించారు. ఆమె సెలవు పెట్టిన రోజు

పిల్లలు నిరాసక్తంగా కనిపించేవారని చెప్పారు. పిల్లలకు నోటు పుస్తకాలు, యూనిఫారాలు కూడా తన సొంత డబ్బులతోనే సమకూర్చేవారని తెలిపారు. బుధవారం ఆమె రిలీవ్‌ కావడంతో విద్యార్థులు భోజనం కూడా చేయలేదని,  దీంతో మధ్యాహ్న భోజనాన్ని గ్రామస్థులకు పంచి పెట్టామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos