నష్టాల్లో కూరుకు పోయిన విపణి

నష్టాల్లో కూరుకు పోయిన విపణి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం భారీ నష్టాల్లోకూరుకు పోయాయి.తొలి నుంచి బలహీనంగానే ఉన్న సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. మదుపర్ల అమ్మకాలతో ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు కూలింది. నిఫ్టీ 11400 స్థాయినీ కోల్పోయింది. కాసేపు ట్రేడింగ్ మెరుగు పడినా ఊగిసలాట కొనసాగుతోంది. 2.15గంటలపుడు సెన్సెక్స్ 302 పాయింట్లు కోల్పోయి 38520 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 11429 వద్ద ట్రేడ్ అయ్యాయి. మందులు, సమాచార సాంకేతికత తప్ప ఇతర అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. యస్బ్యాంకు, సిప్లా, వేదాంతా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, హిందాల్కో ,సన్ఫార్మి, ఏషియన్ పెయింట్స్, భారతి ఇన్ఫ్రాటెల్ నష్ట పోయాయి. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్,యూపిఎల్, బీపీసీఎల్ , యాక్సిస్ బ్యాంకు, టెక్మహీంద్ర, హీరో మోటా కార్ప్, రిలయన్స్, టైటన్ లాభపడ్డాయి.

తాజా సమాచారం