ఆచార్య ఖాసీంపై రాజ ద్రోహ నేరం

ఆచార్య ఖాసీంపై రాజ ద్రోహ నేరం

హైదరాబాద్: ఆచార్య ఖాశీంతో పాటు మావోయిస్టు భావజాలం ఉన్నవారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్ను తు న్నా రని పోలీసులు ఆరోపించారు. మావోజాలాన్ని విద్యార్థులకు ఎక్కించేందుకు కాశీం ప్రొఫెసర్ ముసుగు ధరించారన్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎందరో ఆచార్యులున్నా కాశీంనే అరెస్ట్ చేశామంటే.. ఆయన కుట్ర రూపాన్ని అర్థం చేసుకో వచ్చన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులతో కాశీంకు సంబంధాలు ఉన్నట్లు తేలింద ని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. ‘నడుస్తున్న తెలంగాణ’ సంచికకు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చంద్రన్న నిధులు ఇస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. సంభాషణల విషయంలో మావోయిస్టులు అభివృద్ధి చెందారని, డీకోడ్ చేయలే ని విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారని వివరించారు. కాశీం ఇంట్లో లభ్యమైన హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు, సీడీలు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపామన్నారు. ఎన్క్రిప్ట్ డేటా ఉండటంతో డేటా రిట్రీవ్ చేయడం సాధ్యపడటం లేదని వివరించారు. మావోయి స్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల కాశీం ఇంట్లో పోలీసులు దాదాపు ఐదు గంటలు పాటు సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు సంచుల విప్లవ సాహిత్యం, కర పత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసారు. దీన్ని సవాలు చేస్తూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మ ణ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నాలుగేళ్ల కిందటి కేసులో కాశీం తప్పించుకు తిరుగు తు న్నా డనిఎలా అంటారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos