సినిమాలకు మూడు గంటలు మాత్రమే..

ఏడాది కాలంగా రాజకీయాల కోసం సినిమాలను దూరం పెట్టిన పవన్ కళ్యాణ్ పింక్ హిందీ రీమేక్ చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.ఈ నేపథ్యంలో మరోవార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.సినిమాల కోసం రోజుకి కేవలం మూడు గంటల సమయమే దర్శకనిర్మాతలకు కేటాయించడానికి పవన్ నిర్ణయించుకున్నాడట.మూడు గంటల తర్వాత సినిమా షూటింగ్స్కు ప్యాకప్ చెప్పేసి.. రాజకీయాలతో పవన్ బిజీ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.పార్టీ నిలబడాలంటే.. పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలి. అందుకోసం పవన్ కళ్యాణ్‌కు డబ్బు కూడా అవసరమే. అందుకే అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చెయ్యాలనే నిర్ణయానికొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇది అనుకున్నంత సులభం కాదని అందుకు దర్శకనిర్మాతలు అంగీకరించరని టాక్ వినిపిస్తోంది.ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos