‘సుప్రీం’లో పౌరసత్వ సవాలు

న్యూ ఢిల్లీ: విపక్షాల అభ్యంతరాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఆమోదాన్ని పొందిన పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదా చెల్లుబాటును ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం అత్యున్నత న్యాయ స్థానంలో సవాలు చేసిం ది. ఆ చట్ట సవరణ ప్రాథమిక హక్కులను కాలరాసిందని ఆక్రోశించింది. దాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోరిం ది. ఐయూఎంల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించ నున్నారు. చట్ట సవరణను వ్యతిరే కించి ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజాందో ళనలు చెలరేగాయి. ముఖ్యంగా అసోం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. కర్ఫ్యూ విధించినా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చినిరసనలు చేపట్టారు. వాహనాలకు నిప్పంటించారు. నిరసనల దృష్ట్యా అ సోం, త్రిపురలకు వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లను నిలిపి వేసినట్లు ఈశాన్య రైల్వే ప్రకటించింది. బుధవారమే అంతర్జాల సదుపాయాన్ని నిలిపేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos