నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకుంది

న్యూ ఢిల్లీ: తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకుందని, ఈ హక్కును రాజ్యాంగం కల్పించిందని మరోసారి సుప్రీం కోర్టు స్పష్టీకరించింది. మత మార్పిడులను నిరోధించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. ‘దాఖలు చేసింది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ అని వ్యాఖ్యానించింది. కక్షిదారుపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేశ్ ముఖర్జీల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది ఎటువంటి వ్యాజ్యం? 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? రాజ్యాంగంలో ‘ప్రచారం’ అనే పదం ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీనిపై నీకు మేము భారీ జరిమానా విధించగలం’అని మండిపడింది. కక్షిదారు తరఫున భాజపా నేత, సీనియర్ లాయర్ అశ్విసీ ఉపాధ్యాయ్ వాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos