సుప్రీంకోర్టు మెయిల్స్‌లో మోదీ ఫోటోలు

సుప్రీంకోర్టు  మెయిల్స్‌లో  మోదీ ఫోటోలు

న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్లో ప్రధాని  యాడ్స్ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ చర్య న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహకతను వేరు చేసే సన్నటి గీతను చెరిపేసినట్లు అయింది. సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఈ మెయిల్స్ ఫుటర్ల నుండి ఆ చిత్రాలను తొలగించాలని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ను రిజిస్ట్రి ఆదేశించింది. దీనికి బదులుగా సుప్రీంకోర్టు చిత్రాలను ఉంచాలని ఆదేశించారు. సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోషియేషన్ వాట్సప్ గ్రూపులో ఓ న్యాయవాది ఈ విషయాన్ని పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత రిజిస్ట్రీ స్పందించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్గావ్కర్ తనకు అలాం టి సంఘటన గురించి తెలియదని చెప్పినప్పటికీ.. న్యాయవాదుల నుండి అధికారిక ఫిర్యాదు వచ్చిన తర్వాత, తదుపరి కార్యాచరణ ప్రణాళిక చేపడతామని అడ్వ కేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ కార్యదర్శి జోసెఫ్ అరిస్టాటిల్ చెప్పారు. దీనిపై ఎన్ఐసి అధికారులను ప్రశ్నించగా..ఈ స్రిప్ట్ను అన్ని ఎన్ఐసి వేదికలపై వినియోగిం చామని, అయి తే సుప్రీంకోర్టు వేదిక నుండి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కొన్ని గంటల తర్వాత రిజిస్ట్రీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక ఈ మె యిల్స్ నుండి ఈ చిత్రం వెళ్లినట్లు శుక్రవారం గుర్తించామని, దీనికి, న్యాయ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేసింది. ఈ మెయిల్లో ప్రకటనల గురించి సీని యర్ అడ్వకేట్ చందర్ ఉదరు సింగ్ మాట్లాడుతూ… అవి అత్యంత అభ్యంతరకరమైనవిగా అభివర్ణించారు. భారత్లోని న్యాయ వ్యవస్థలు.. ప్రభుత్వ కార్యాలయాలు కావని, ప్రభుత్వ ప్రచార యంత్రాలుగా వీటిని వినియోగించకూడదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos