సామాజిక మాధ్యమాలపై సుప్రీం కీలక నిర్ణయం!

సామాజిక మాధ్యమాలపై సుప్రీం కీలక నిర్ణయం!

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే తప్పుడు వార్తలకు,యువతపై ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నీలిచిత్రాల వెబ్‌సైట్‌లకు అడ్డుకట్ట వేయడానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.సామాజిక మాధ్యమాల్లో ఇకపై ఖాతాలు తెరవాలంటే ఆధార్‌కార్డు వివరాలు తప్పనిసరిగా జత చేయాలనే కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ లల్లో వ్యక్తిగతంగా అకౌంట్ ను ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను పొందుపరచాలనే విషయంపై అభిప్రాయాలను వెల్లడించాలని సూచిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వంతో పాటు ట్విట్టర్, గూగుల్, యుట్యూబ్ తదితర సామాజిక మాధ్యమ సంస్థల యాజమాన్యానికి సైతం దీనిపై అభిప్రాయాలు వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనితో పాటుదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సోషల్ మీడియాకు సంబంధించిన పిటీషన్ల విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఫేస్ బుక్ యాజమాన్యం ఇదివరకే దాఖలు చేసిన పిటీషన్ పైనా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనూరాధ బోస్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పిటీషన్ పై విచారణ నిర్వహించింది. సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాలనే పిటీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమ, మంగళవారాల్లో వాదనలను ఆలకించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఫేస్ బుక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ తమ వాదనలను వినిపించారు.సామాజిక మాధ్యమాలకు ఆధార్‌కార్డులు జత చేయడం ద్వారా సమాజంలో ప్రముఖ వ్యక్తులపై తప్పుడు వార్తలను అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నకిలీ వార్తలకు అరికట్టవచ్చని వేణుగోపాల్‌ వాదించారు.దీంతోపాటు యువతను,చిన్నపిల్లలను నాశనం చేస్తున్న పోర్న్‌వెబ్‌ సైట్లను కూడా ఆధార్‌కార్డులు జత చేయడం ద్వారా చాలా వరకు అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.దీనిపై వాదనలను విన్న తరువాత ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ సంస్థల యాజమాన్యానికి నోటీసులను జారీ చేసింది. ఫేస్ బుక్ దాఖలు చేసిన పిటీషన్ పై అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 13 తేదీకి వాయిదా వేసింది.కాగా ఈ వ్యవహారంలో వాట్సాప్‌కు మినహాయింపు ఇచ్చారు.నకిలీ వార్తలను గానీ, ప్రముఖుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని గానీ లేదా పోర్నోగ్రఫికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను వాట్సప్ ద్వారా పంపించిన వారిని తేలిగ్గా గుర్తించడానికి వీలున్న నేపథ్యంలో వాట్సప్ ను మినహాయించినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos