గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడంపై పిటిషన్లు..! విచారించనున్న ‘సుప్రీం’..

గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడంపై పిటిషన్లు..! విచారించనున్న ‘సుప్రీం’..

న్యూ ఢిల్లీ: అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్లు ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతు న్నారంటూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు సరైన కారణం లేకుండా జాప్యం చేస్తున్నారని ఆయా ప్రభుత్వాలు ఆరోపించాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణ జరుపనున్నది.తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పలు బిల్లులను తిప్పి పంపారు. శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశమైన మళ్లీ తొమ్మిది బిల్లులను ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది. వ్యవసాయం, ఉన్నత విద్యతో పాటు పలు శాఖలకు చెందిన బిల్లులు ఇందులో ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. బిల్లులు తొక్కిపెట్టడం ‘తీవ్ర ఆందోళనకరమైన విషయం’ అని పేర్కొంది. పిటిషన్పై కేంద్రం స్పందన కోరుతూ నోటీసులు పంపింది.సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సహాయం కోరింది. రిట్ పిటిషన్లో లేవనెత్తిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటూ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు తీవ్రను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం సెక్రెటరీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. గవర్నర్కు పంపిన 12 బిల్లులు ఆమోదం పొందలేదని కోర్టుకు సమర్పించిన వాంగ్మూలాలను బట్టి తెలుస్తుందని పేర్కొంది. ఖైదీల ముందస్తు విడుదల, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం తదితర కీలకమైన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయంటూ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos