రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారం

రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారం

న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారం సోమవారం మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం విచారణ చేపట్టింది.ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య సేవల విభజన వివాద వ్యాజ్యాన్ని కూడా విచారించనుందని న్యాయాలయ వర్గా లు తెలిపారు. మూడు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలు చేపట్టే వ్యాజ్యాల విచారణ వచ్చే 3-4 రోజుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపాయి. ప్రస్తుతం ఎన్ఐసీ వేదికపై ఆన్ లైన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. భవిష్యత్తులో ప్రత్యేక ఓటీటీని కూడా తీసుకురానుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఓటీటీని తీసుకు రానుంది. యూట్యూబ్ కాకుండా కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారానికి తమ సొంత వేదికను తీసుకొస్తామని ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ సోమవారమే ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos