అసాధారణ పరిస్థితుల్లోనే మంత్రి వర్గ సమావేశం

అసాధారణ పరిస్థితుల్లోనే మంత్రి వర్గ సమావేశం

అమరావతి: అసాధారణ పరిస్థితుల్లోనే మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి సి.ఎస్‌.సుబ్రహ్మణ్యం మంగళవారం ఇక్కడ స్పష్టీకరించారు. చర్చనీయాంశాల్నితెలపాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరినట్లు తెలిపారు. ఆ అంశాల్ని పంపిన రెండు రోజులకు కానీ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం కాబోదని చెప్పారు. సానుకూలంగా స్పందించినపుడే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పదిన మంత్రివర్గ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శిని సూచించింది. దరిమిలా మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలన, రాజకీయ కార్యదర్శి శ్రీకాంత్‌తో ప్రధాన కార్యదర్శి సమావేశమైన తర్వాత విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలో వద్దో తీర్మానిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా పేర్కొన్నారు. మార్గదర్శకాల్ని అన్ని రాజకీయ పక్షాలు, అధికారులకు మోడల్ కోడ్ పంపామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos