సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం

సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం స్పందించడం ఇదే మొదటిసారి. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉపయోగించుకొని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన దాతల పేర్లు బయటపెట్టాలని ఎస్బీఐని న్యాయస్థానం ఆదేశించింది. పథకాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ, ప్రధాని కార్యాలయం కానీ కోర్టు తీర్పుపై ఇప్పటి వరకూ స్పందించ లేదు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాము. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. కాగా కోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని, దానిని సవాలు చేయాలా వద్దా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. అయితే కేంద్రప్రభుత్వం దీన్ని సవాలు చేయాలా..లేదా అని ఆలోచిస్తున్నది. మరోవైపు ఎస్బీఐ, ఆర్థికమంత్రిత్వశాఖ ఇప్పటిదాకా నోరువిప్ప లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos