సరిహద్దులో ఎస్‌బీఐ సాహసం..

సరిహద్దులో ఎస్‌బీఐ సాహసం..

ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉ్రదిక్తకరంగా మారిన నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకు చేసిన సాహసం భారతీయులను ఆశ్చర్యపరుస్తోంది.లడఖ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 10,400 అడుగుల ఎత్తులో చైనా పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లోని నుబ్రా వ్యాలీ లోయలోశాఖను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచింది. ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ శాఖను ప్రారంభించారు.ఇక కేవలం ఆరు వేల మంది జనాభా ఉన్న నుబ్రా వ్యాలీ భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లోని లెహ్ లోని తుర్ తుక్ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇక చైనా సరిహద్దుల్లో గల సియాచిన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మిగత బ్యాంకులు కనీసం ఈ ప్రాంతంలో శాఖను ఏర్పాటు చేయడానికి కూడా సాహసించని పరిస్థితుల్లో ఎస్‌బీఐ ధైర్యంగా ముందుకెళ్లడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos